క్యాబ్ దోపిడీ : పూణె నుంచి బెంగళూరుకు రూ.3 వేల 500.. ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి రూ.2 వేలు

క్యాబ్ దోపిడీ : పూణె నుంచి బెంగళూరుకు రూ.3 వేల 500.. ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి రూ.2 వేలు

క్యాబ్ ఛార్జీలకు రెక్కలు వచ్చాయి. మామూలు కార్ల ఛార్జీలకంటే ఆన్‌లైన్ బుకింగ్ ఫ్లాట్‌ఫామ్‌లో బుక్ చేసుకున్న ఓలా క్యాబ్, ఉబర్, రాపిడో లాంటివి వినియోగదారులపై ధరలు బాదుతున్నాయి. నిన్న మొన్నటి వరకు టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఒక్క రైడ్ కు లక్షలు, కోట్లు చూపించింది. ఇప్పుడు నిజంగానే కస్టమర్ల దగ్గర వేలు గుంజుతున్నారు. బెంగళూర్ లో ఓ యువతికు చేదు అనుభవం ఎదురైంది. ఆమె పూణే నుంచి బెంగళూర్ విమానంలో వచ్చింది. అందుకు అయిన ఫ్లైట్ ఛార్జీ రూ.3,500. తర్వాత ఆ యువతి బెంగళూర్ ఏయిర్ పోర్ట్ నుంచి తన ఇంటికి వెళ్లడానికి ఉబర్ లో క్యాబ్ బుక్ చేసుకుంది. దాని అయిన ఛార్జీ రూ.2005. దీంతో విమానం, క్యాబ్ రైడ్ రెండు ఒకేలా ఉన్నాయంటు యువతి సెటైరికల్ గా తన అనుభవాన్ని ఎక్స్ ద్వారా పంచుకుంది. 

మనవి శర్మ రాత్రి 12 గంట సమయంలో బెంగుళూర్ ఎయిర్ పోర్ట్ నుంచి ఆమె ఇంటికి ఉబర్ లో క్యాబ్ బుక్ చేసుకుంది. ఆ రైడ్ కు ఉబర్ రూ.2వేలు ఛార్జ్ చేసింది. తాను పూణే నుంచి బెంగుళూర్ వచ్చిన టికెట్ ధరకు సమానంగా ఎయిర్ పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లడానికి ఛార్జీ అయిందని సెటరికల్ గా తన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. క్యాబ్ బిల్ సిప్, ప్లైట్ టికెట్ రెండు పక్కపక్కన పెట్టిన ఫొటో ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది. దీనికి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

ALSO READ :- సికింద్రాబాద్లో లక్ష మెజార్టీతో గెలుస్తాం : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  • Beta
Beta feature
  • Beta
Beta feature
  • Beta
Beta feature